రోజా చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా… ఎంత మంచి పని చేస్తుందో

రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ . ఆమె ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ప్రస్తుతం రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె బుల్లితెరపై అందరిని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మన్‌గా తన బాధ్యతను నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేంతే వరకు రోజాను అందరు ఐరెన్ లెగ్ అని పిలిచేవారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం తీవ్రంగా జరిగింది. 2014లో రోజా ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీ అడుగుపెట్టినపుడు వైసీపీ అధికారంలోకి రాకుండా, టీడీపీలోకి అధికారంలోకి వచ్చింది.

కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రోజా తాను గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర తప్పని తేలిపోయింది. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోన్న ఈ సమయంలో రోజా.. ఒక నటిగా, ఎమ్మెల్యేగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరు దేశ ప్రధాని పిలుపునిచ్చినట్టు 21 రోజులు ఇంటివద్దే ఉండాలని ప్రజలను కోరారు. అదే మనం సమాజానికి చేసే అది పెద్ద మేలని పేర్కొన్నారు.

తాజాగా ఎమ్మెల్యే కమ్ నటి అయిన రోజా పేద కళాకారుల ఆకలి తీర్చడం కోసం 100 బియ్యం బస్తాలను అందజేసారు. అంతేకాదు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పేద కళాకారులతో పాటు పేద ప్రజలను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకుల వద్ద జోలె పట్టి విరాళాలు సేకరించబోతున్నట్టు రోజా సన్నిహితులు చెబుతున్నారు. ఇపుడు చేసింది కొంత మాత్రమే మిగిలింది కొండంత అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈమె భర్త ప్రముఖ దర్శకుడు సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ సౌత్ ఇండియాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో ఆయన పేద కళాకారులను ఆదుకోవాలని పిలుపునివ్వడంతో చాలా మంది హీరోలు ముందుకొచ్చి తమకున్నంతలో సాయం చేస్తున్నారు.

error: Content is protected !!