సుధీర్‌ బాబు సినిమాల్లోకి రావటానికి మహేష్ సాయం ఉందా… లేదా…?

సూపర్‌ స్టార్‌కి బావ, ఘట్టమనేని అల్లుడు అనే బ్యాక్‌ గ్రౌండ్‌తో సుధీర్‌బాబు టాలీవుడ్‌ని పలకరించాడు. తొలి సినిమా ‘ఎస్‌ఎమ్‌ఎస్‌’లో చూసిన సుధీర్‌బాబుకీ, ఇప్పుడు చూస్తున్న సుధీర్‌బాబుకీ చాలా చాలా డిఫరెన్సెస్‌ ఉన్నాయి. సినిమా సినిమాకీ తనను తాను మార్చుకుంటూ వచ్చాడు. అయితే, సుధీర్‌బాబుకి హీరో అవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే.. అస్సలేమాత్రం ఫిల్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేని సుధీర్‌బాబుకి మొదటి నుండీ హీరో అవ్వాలన్న కోరిక ఉండేదట. ఫిట్‌నెస్‌ గట్రా చూసి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ హీరోగా ట్రై చేయమని చెప్పేవారట.

కానీ, అదేమంత ఈజీ కాదని మధ్యలోనే ఆ కోరికను విరమించేసుకున్నాడట. అయితే, తనకు బ్యాడ్మింటన్‌ అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్‌ దిగ్గజం పుల్లెల గోపీచంద్‌ దగ్గర సుధీర్‌బాబు ట్రైన్‌ అయిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్‌లో ఛాంపియన్‌ అనిపించుకోవడానికి సుధీర్‌బాబు చాలా చాలా కష్టపడ్డాడట. అనుకోకుండా ఘట్టమనేని ఫ్యామిలీకి అల్లుడు కావడం, ఆ తర్వాత హీరో అవ్వాలన్న తన కోరిక నెరవేర్చుకోవడం అలా అలా ఫాస్ట్‌గా జరిగిపోయాయట. కానీ, హీరోగా నిలదొక్కుకోవడమన్నది అంత తేలికైన విషయం కాదని సుధీర్‌బాబు ఇప్పటికీ చెబుతున్నాడు. బ్యాడ్మింటన్‌ కోసం తాను పడిన కష్టమే ఈరోజు హీరోగా నిలదొక్కుకోవడానికీ ఉపయోగపడిరదని సుధీర్‌బాబు అంటున్నాడు. ప్రస్తుతం సుధీర్‌బాబు నటించిన ‘వి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రిలీజ్‌ వాయిదాలో ఉన్న సంగతీ తెలిసిందే.

error: Content is protected !!