అందరి హీరోల ఫ్యాన్స్ కు ఒక్క ట్వీట్ తో ఫుల్ మీల్స్ పెట్టిన పవన్!

మన టాలీవుడ్ లో ఎక్కడా లేని స్థాయి ఫ్యాన్ వార్స్ ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అవి ఎంత స్థాయి వరకు వెళతాయో అదే సమయంలో ఎంత నీచంగా దిగజారుడుగా ఉంటాయో కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న మన తెలుగు అగ్ర హీరోలు అందరికీ యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.

దానితో తాము అభిమానించే హీరోల పట్ల పెంచుకున్న అమితమైన ప్రేమ కాస్త ఇతర హీరోల మీద ద్వేషంగా మారిపోయింది. దీనితో ఏదొక సందర్భంలో ఈ ఫ్యాన్ వార్స్ భగ్గుమంటాయి. అలాగే మరోపక్క అంతా కలిసే ఉంటే బాగుంటుంది అని కూడా వీళ్ళకి ఉంటుంది.

అలా ఒక హీరో ఇంకో హీరో కోసం మాట్లాడిన ఒకే ఫ్రేమ్ లో కనిపించినా అది వారికి పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది కానీ అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మరో స్టార్ హీరో టాలీవుడ్ లో ఉన్న ఇతర స్టార్ హీరోల కోసం మాట్లాడితే ఎలా ఉంటుంది వారికి?

తాజాగా కరోనా కారణంగా మొత్తం టాలీవుడ్ కదలి కోట్లాది రూపాయలను విరాళం ఇచ్చేసరికి అలా ఇచ్చిన వారిలో మెగాస్టార్ చిరు పేరు మొదలు కొని మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్ ఇలా అందరి పేర్లు చెప్పి మరీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక ట్వీట్ పెట్టారు. దీనితో మొత్తం వారి అభిమానులు అంతా పవన్ కారణంగా ఒక్కసారిగా ఫుల్ మీల్స్ తిన్నట్టు అయ్యింది అని చెప్పాలి.

error: Content is protected !!