తెలుగు ఛానెల్స్ పై మొదలైన కరోనా ఎఫెక్ట్.!?

కరోనా వైరస్ ప్రభావం మూలాన ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.అలా చేసుకున్న వాటిలో బుల్లితెర రంగం కూడా ఒకటి. ఆకస్మికంగా ఏర్పడ్డ ఈ పరిణామాల మూలాన మన తెలుగు బుల్లితెర రంగంపై కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

వైరస్ మూలాన ఎప్పటికప్పుడు జరగాల్సిన షూటింగ్ షెడ్యూల్స్ అన్ని రద్దు కావడం మూలాన అప్పటికే షూట్ పూర్తి చేసుకున్న సీరియల్స్ మరియు షోలు యధావిధిగా టెలికాస్ట్ అయ్యాయి. ప్రస్తుతానికి కొన్ని ఛానెల్స్ లో సీరియల్స్ మరియు షోలు కొన్ని రోజుల వరకు టెలికాస్ట్ అవుతున్నాయి.

చానల్స్ లో సీరియల్స్ ప్లేస్ లో తమ ఈవెంట్స్ ను టెలికాస్ట్ చేసేస్తున్నారు. కానీ ప్రసూతానికి కంటిన్యూ చేస్తున్న ఛానెల్స్ లో మాత్రం వచ్చే వారం నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ రావు అన్నట్టు సమాచారం. అలాగే మన ఫేమస్ షోల తాలూకా ప్రోమోలు కూడా ఆగే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు సర్దుమణుగు అవుతాయో చూడాలి.

error: Content is protected !!