పవన్ పై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్…ఇది ఎక్కడకు దారి తీస్తుందో…?

అన్ని ఫ్యామిలీస్ మధ్య ఉండేలాగానే టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి ఉండే గిల్లికజ్జాలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమ వజ్రోత్సవాలు సమయంలో చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించిన వేడుకల్లో చిరు,మోహన్ బాబు ఫ్యామిలీల మధ్య వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ ఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద గొడవల్లో ఒకటిగా చెప్పక తప్పదు. అందుకే నేటికీ వీటి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అప్పటి నుండి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉండేది. కానీ ఈ మధ్య వీరి మధ్య ఇగో ప్రాబ్లమ్స్ తొలగిపోయి మంచి స్నేహితుల్లా మెలుగుతున్నారు. ఇప్పుడు ఎన్నో వేడుకలకు కలిసి హాజరై ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటున్నారు.

ఇక రీసెంటుగా మంచు మనోజ్ చిత్ర షూటింగ్ ప్రారంభానికి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన చిరంజీవికి స్వాగతం పలికిన మోహన్ బాబుకి ఫన్నీ వేలో ‘రాననుకున్నావా రాలేవనుకున్నావా’ అంటూ రిప్లై ఇచ్చి వాళ్ల మధ్య మంచి రిలేషన్ ఉందని మరోసారి స్పష్టం చేసారు. చిరంజీవి, మోహన్ బాబులు ఇద్దరూ స్నేహితులుగా మారినా ఆ రెండు ఇన్సిడెంట్స్ తాలూకు జ్ఞాపకాలు మాత్రం ఆ ఫ్యామిలీలను ఇంకా వదల్లేదు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఐటీ స్కాం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా మంచు విష్ణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారని యాంకర్ అడిగితె, ‘పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదని అంటూనే అనవసరంగా ఓవర్ రియాక్టయ్యాడని బహుశా ఆయన్ని అడిగితేనే దీనికి సమాధానం దొరుకుతుందని షాకింగ్ కామెంట్స్ చేసాడు. నిజానికి ఆరోజు నాకు తెలిసి మా నాన్న గారు అంతగా ఏమి మాట్లాడలేదని వాళ్లిద్దరూ కొన్ని సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉంటున్నారని’ సమాధానమిచ్చాడు. అంతేకాకుండా ఈ పొజిషన్ కి రావడానికి వాళ్లు ఎంతో స్ట్రగుల్ అయ్యారని చెబుతూ ఈ జనరేషన్ హీరోలు కూడా చిరంజీవి, మోహన్ బాబులని ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు. తనవరకూ తాను ఈ జనరేషన్ హీరోలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నానని అన్నాడు.

error: Content is protected !!