ఇది చూసారా?”వకీల్ సాబ్” లో సూపర్ స్టార్ మహేష్ అంట.!

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించి తర్వాత ప్రాజెక్ట్ కోసం ఎలాంటి సమాచారం లేదని మహేష్ అభిమానులు సతమతం అవుతుంటే ఇప్పుడొక ఊహించని వార్త వారికి షాకిస్తుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కూడా ఉన్నాడట.

కంగారు పడొద్దు ఇది ఇప్పటికే నిజం కాదని మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఇంతకీ ఈ చిత్రంలోకి మహేష్ ఎలా వచ్చారంటే గూగుల్ లో ఊరికే మహేష్ బాబు పేరు పెట్టి సెర్చ్ చేస్తే మహేష్ కు సంబంధించి కొన్ని వివరాలతో పాటు అతని నుంచి రాబోతున్న సినిమాగా పవన్ “వకీల్ సాబ్” ను చూపించింది. దీనితో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఇది చూసి నవ్వుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి కాంబో అంటే అది మాత్రం ఊహలకు అందనిదే అని చెప్పాలి.

error: Content is protected !!