శ్రీను వైట్లకు కోనాకు ఉన్న కోల్డ్ వార్ కు ఇదే కారణం!

మన టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయినటువంటి శ్రీను వైట్ల మరియు రచయిత కోనా వెంకట్ ల కాంబోకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. అలాగే వారిద్దరికీ ఒక కోల్డ్ వార్ ఉందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. కానీ దానికి ఉన్న అసలు కారణం ఏమిటి అన్నది అంత క్లారిటీగా ఎవరికీ తెలీదు.

అయితే దానిపై కోనా ఆలీతో సరదాగా షో ద్వారా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక రచయితకు దర్శకునికి మధ్య ఉండాల్సిన బాండింగ్ కోసం చెప్తూ శ్రీను వైట్ల గొప్పతనం కోసం కోనా తెలిపారు. కేవలం ఒక్క శ్రీను కోసమే అని కాకుండా ఏ దర్శకుడు అయినా సరే తమ టీం నుంచి ఒక పనిని రాబట్టుకున్నప్పుడు అతను కూడా కొంత దానిని మెరుగుపరుస్తాడని..

అందువల్ల మొత్తం తానే చేసేసాను అని అనుకోవడం కరెక్ట్ కాదని అలాంటి కారణం మూలానే నేను శ్రీనుకు దూరం అయ్యానని కోనా తెలిపారు. అలాగే శ్రీను లేనిదే కోనా లేడని కోనా లేనిదే శ్రీనుకు కూడా అంత పేరు వచ్చి ఉండకపోవచ్చని అలాగే తన కథలు కూడా మరో దర్శకుడు తీసి ఉంటే ఖచ్చితంగా హిట్టయ్యేవి కాదు అని తెలిపారు.

error: Content is protected !!