తెలుగులో రిలీజ్ కాకుండానే ప్రైమ్ లోకి వచ్చేసిన లేటెస్ట్ చిత్రం!

తమిళ్ యువ హీరో కార్తికేయ హీరోగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “హీరో”. సూపర్ హీరోల కథ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆ జాన్రాలో అక్కడ మంచి హైప్ ను తెచ్చుకొంది కానీ ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మన తెలుగు భాషలో కూడా “శక్తి” అనే టైటిల్ తో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం చేసారు. యాక్షన్ హీరో అర్జున్ ఒక కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం ఇదే మార్చ్ లో మన తెలుగులో విడుదల కావాల్సి ఉంది.

కానీ కరోనా వల్ల పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమా విడుదల కాస్తా ఆగిపోయింది. అయితే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఇప్పటికే ఈ చిత్రం అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదలయ్యే పరిస్థితులు లేకపోయే సరికి తెలుగు వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసారు. మరి ఈ లాక్ డౌన్ లో దీనిపై కూడా ఒక లుక్కెయ్యండి.

error: Content is protected !!