మల్లెమాలకు కొత్త తలనొప్పి… ఎలా అధికమిస్తుందో…

ప్రపంచాన్ని గడగలాడిస్తున్న కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే జబర్దస్త్ కామెడీ షో పై కూడా చూపించిందని అంటున్నారు. ఈ షో ఆరంభం నుంచి ఎంతోమంది కడుపు నింపుతోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అన్నీ ఆగిపోయాయి. లాక్‌డౌన్ కావడంతో ఇల్లు దాటి ఎవరూ బయటికి రావడం లేదు. ఎవరింట్లో వాళ్లు గప్ చుప్ అంటూ కూర్చున్నారు. ముఖ్యంగా కమెడియన్లు మాత్రమే కాకుండా అందులో పని చేసేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. వందల మంది దీనికోసం కష్టపడుతున్నారు. షూటింగ్స్ ఆగిపోవడంతో ఇప్పటికే రష్మి గౌతమ్, శ్రీముఖి, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్లంతా వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

అలాగే గెటప్ శ్రీను కూడా ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉన్న వీడియో పెట్టాడు. మిగిలిన వాళ్లు కూడా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ కామెడీ షో నెక్ట్స్ షెడ్యూల్ ఆగిపోయింది. ఇప్పటికే షూట్ చేసుకున్న ఎపిసోడ్స్ కూడా పూర్తి కావడంతో వచ్చే వారం తర్వాత పరిస్థితి ఏంటనేది ఇంకా తేలడం లేదు. అయితే మల్లెమాల యాజమాన్యం మళ్లీ పాత ఎపిసోడ్స్ ప్లే చేస్తే,ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తున్నారు. దాంతో పాటు ఈటీవీలో మరికొన్ని సీరియల్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పటికే స్లాట్స్ నింపడానికి ఒకప్పుడు చేసిన కామెడీ షోలతో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి ఈవెంట్స్ రిపీట్ వేసుకుంటున్నారు.

మూడు గంటలకు పైగా వీటితోనే కవర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కూడా ప్రస్తుతానికి ఆగిపోయేలా కనిపిస్తుంది. వచ్చేవారం ప్రోమో అయితే పడింది. దీన్ని బట్టి వచ్చే వారం వరకు జబర్దస్త్ కానీ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు కానీ ఎలాంటి సమస్యా లేదు. ఎప్రిల్ తొలివారం తర్వాత రెండో వారంలో వచ్చే జబర్దస్త్ మాత్రం లేకపోవచ్చు. ప్రస్తుతం నటీనటులతో పాటు యాంకర్స్ కూడా అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. టెక్నిషియన్స్ కూడా అంతా హౌజ్ అరెస్ట్ అయిపోయారు. అందుకే జబర్దస్త్ ప్రస్తుతానికి ఆగిపోయింది. మళ్లీ ఎప్రిల్ 14 తర్వాతే కొత్త షూటింగ్.. అప్పటికీ కరోనా కంట్రోల్ కాకపోతే మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందన్న మాట వినిపిస్తోంది. మరి మల్లెమాల యాజమాన్యం ఏంచేస్తుందో చూడాలి.

error: Content is protected !!