మజిలీ హీరోయిన్ పరిస్థితి ఎలా అయిందో చూడండి…పాపం…?

అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో తానేమిటో రుజువుచేసుకోడానికి చాలా శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగా గత సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన మజిలీ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రంలో హీరోగా అక్కినేని నాగచైతన్య నటించగా సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా వేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, సాహు గరిపాటి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో నటించిన దివ్యాంశ కౌశిక్ తన నటనతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది.

తన అందం అభినయంతో కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెట్టేసింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ దివ్యాంశ కౌశిక్ మాత్రం తగిన ఛాన్స్ లు తెచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో నటించిన తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త మూవీ లేదు.

సహజంగానే ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఆలోచనలు చేస్తారు. అందుకే దివ్యంశ కౌశిక్ కి ఏమైందా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారట. అయితే సరిగ్గా ఇలాంటి పరిస్థితి నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కి ఎదురైంది. అయితే ఇటీవల కాలంలో శ్రద్ధాశ్రీనాథ్ గుంటూరు టాకీస్ మూవీ లో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ సరసన మూడవ హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది. మరి దివ్యంశ కౌశిక్ కి ఛాన్స్ ఎపుడు వస్తుందో చూడాలి.

error: Content is protected !!