ఆర్ ఆర్ ఆర్ వివాదంలో చిక్కుకుంటుందా…కారణాలు ఇవే..?

ఇప్పటివరకూ అపజయం ఎరుగని డైరెక్టర్ గా నిల్చి దర్శక ధీరునిగా నిల్చిన ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా కు సంబంధించి ఇటీవలే టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేసిన జక్కన్న వచ్చే యేడాది సంక్రాంతి కానుక గా జనవరి 8న విడుదల కానున్నట్టు మరోసారి స్పష్టం చేసారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నెంబర్ వన్ మాస్ హీరోలతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ పెట్టారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. కాగా ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ ఆహార్యం చరిత్రకు పొంతన లేకుండా కొత్తగా ఉందంటూ కొంత మంది వాదన వినిస్తున్నారు. త్వరలో బయటకు రానున్న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సైతం రియాల్టీకి దూరంగా ఉండే ఛాన్స్ కూడా లేదని అంటున్నారు.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వారసులు కూడా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ పై చారిత్రక వాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తారని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇరువురు చారిత్రక యోధుల నాయకులు రోడ్డు మీదుకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే వాళ్ల పేరు పెట్టుకొని ఈ సినిమాను ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నానని రాజమౌళి చెప్పడంతో ఈ సినిమా పై కాపీ రైట్ ఇష్యూ వచ్చే అవకాశము లేకపోలేదు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల చేయడం రాజమౌళికి కత్తి మీద సాము అనే చెప్పాలి. రాజమౌళి ఈ సినిమాకు పెట్టిన ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా టైటిల్ విషయానికొస్తే.. బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. యుద్ధంలో యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం. ఆడియన్స్ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

error: Content is protected !!