“V”కి కొత్త తలనొప్పులు… వీటిని తట్టుకొని నిలబడుతుందా?

అన్నిచోట్లా సెంటిమెంట్స్ ఉన్నట్టే, సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ముహూర్తం దగ్గర నుంచి రిలీజ్ దాకా అన్నీ సెంటిమెంట్ ప్రకారమే ఫాలో అవుతుంటారు. ఇందులో కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లతో పాటు నెగెటివ్ సెంటిమెంట్లను కూడా బాగా నమ్ముతారు. బాహుబలి-2 రిలీజ్ అయ్యేవరకూ తెలుగులో ఒక్క సీక్వెల్ కూడా హిట్టు కాలేదు. సీక్వెల్ సినిమాలు 90శాతం డిజాస్టర్లే. బాహుబలి దాన్ని బ్రేక్ చేసింది. ఇక పలుమార్లు వాయిదా పడిన సినిమాల్లో అధిక శాతం ఫ్లాపులుగానే నిలిచాయి.

ఇదే సెంటిమెంట్ ఇప్పుడు నాని – సుధీర్ బాబుల చిత్రం ‘వి’ విషయంలో వెంటాడుతోంది. ఈ నెగెటివ్ సెంటిమెంట్ తప్పేలా లేదని అంటున్నారు. నిజానికి ‘వి ‘ సినిమా లాక్ డౌన్ ప్రకటించక ముందే ఒకసారి వాయిదా పడింది. అప్పటికి వర్క్ పెండింగ్ ఉండడంతో వాయిదా వెయ్యాల్సి వచ్చింది. వారం క్రితమే లాక్ డౌన్ ప్రకటించడంతో ఏప్రిల్ లో రిలీజ్ కూడా సందేహం అని చెప్పక తప్పదు. ఇలా వాయిదా పడిన సినిమాలకు సాధారణంగా బజ్ తగ్గిపోతుంది. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్ తప్పించుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడం కుదురుతుందా అంటున్నారు.

అంతెందుకు గత ఏడాది ‘అర్జున్ సురవరం’ కూడా ఎన్నో వాయిదాలు పడీ పడీ చివరకు రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇలా చాలా రేర్ ఘటనలు మినహా ఎక్కడా పలుసార్లు వాయిదా పడిన సినిమాలు ఆడిన దాఖలాలు లేవని అంటున్నారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు థియేటర్లు ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసినా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారో లేదో ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘వి’ ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.

error: Content is protected !!