చిరు జగన్ లు ఎందుకు కలుసుకున్నారో తెలుసా – స్పష్టత ఇచ్చిన చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ప్రముఖ నటుడు చిరంజీవి వెళ్లి కలుసుకోవడం ప్రస్తుతానికి రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు చిరంజీవి కూడా అధికార వైసీపీ లో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఇలాంటి వార్తలపై స్పందించిన చిరంజీవి వారిద్దరి మధ్యన కలయికకు గల కారణాన్ని వివరిస్తూ ఒక స్పష్టత ఇచ్చారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ని కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, వారిద్దరి మధ్యన రాజకీయాలకు సంబందించిన చర్చలు జరగలేదని చిరంజీవి వెల్లడించారు.

ఇకపోతే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే తామందరి మాట అని చిరంజీవి తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఈ వయసులో తనకు మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళ్లే ఆలోచన రాలేదని వాఖ్యానించారు. అయితే ముందు నుండి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాల దృష్ట్యా, వారి కుటుంబాన్ని తరచుగా కలుస్తుంటానని, అంతకు మించి తమ మధ్యలో రాజకీయాలకు తావుండదని చిరంజీవి తేల్చి చెప్పేశారు.

error: Content is protected !!