ఇకపై ఇంటింటికి కరోనా పరీక్షలు.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!

ఏపీలో కరోనా అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీలోనే కరోనా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయని అందుకే కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే కరోనా త్వరగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఎక్కువ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని చెబుతున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే ఇకపై రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా రాష్ట్రంలోని రెడ్ జోన్ ప్రాంతాలలో దీనిని అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాలలో ప్రతి ఇంట్లో ఒక్కొక్కరిని తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి చూశారు. అయితే ఈ టెస్ట్‌లకి సంబంధించిన ఫలితాలు రెండు రోజులలో రానున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా ఇంటింటికి కరోనా పరీక్షలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

error: Content is protected !!