జగన్ మరో సంచలన నిర్ణయం..దీని వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా?

వైసీపీ పార్టీ అధినేత మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఏదొక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటూ అనుక్షణం సంచలనం రేపుతూనే ఉన్నారు. అలా ఇప్పుడు కరోనా కష్ట కాలంలో తీసుకున్న మరో సంచలనాత్మక నిర్ణయం మందు బాబులకు గుబులు పుట్టిస్తుంది.

నిన్న ఆంధ్ర రాష్ట్రం సహా మొత్తం భారతదేశం అంతా ఆంక్షలతో మద్యం దుకాణాలను ఓపెన్ చేసాయి. అయితే జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మళ్ళీ 25 శాతం రేట్లను పెంచి షాకిచ్చినప్పటికీ మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరారు.

కానీ ఇప్పుడు ఇదే దెబ్బ అనుకుంటే దీనికి మరింత గట్టిగా ఇంకో 50 శాతం రేట్లు పెంచుతు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు మొత్తం 75 శాతం పెంచేశారు. కేవలం ఒక్క రోజులోనే జగన్ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకోడానికి గట్టి కారణాలు లేకపోలేవా అంటే ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పాలి.

మొదటగా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు ఒకటి అయితే ఎలాగో 25 శాతం పెంచినప్పుడు తాగే వాళ్ళు ఇంట్లో డబ్బులు ఉంచకుండా పట్టుకెళ్ళిపోతారు. 25 శాతం అంటే సామాన్య ప్రజలకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ ఈరోజు పెంచిన 75 శాతం అంటే అసలు రేటు కంటే చాలా అధికం అందుకే ఖచ్చితంగా ఆలోచించి తీరుతారు.

అలాగే ఇది కూడా మద్యపాన నిషేదానికి ఒక మంచి అడుగు కావున ఇదే జగన్ ప్లాన్ లో అసలైన ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఈరోజు నుంచే అమలు లోకి రానున్న ఈ ధరలతో పాటుగా మళ్ళీ ఇదే నెల ఆఖరున మొత్తం 15 శాతం మద్యం మద్యం దుకాణాలను మూసేసి యోచనలో కూడా ఉన్నట్టు ఇప్పుడు సమాచారం.

error: Content is protected !!