ఎన్టీఆర్ కి విలన్ గా టాప్ కమెడియన వర్క్ అవుట్ అవుతుందా?

ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో విలన్ పాత్రలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ నటిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఐతే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.ఈ మధ్య కాలంలో సునీల్ నటించిన “డిస్కో రాజా” చిత్రంలో నెగిటివ్ షేడ్స్ కలిగినటువంటి పాత్రలో సునీల్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.దీంతో త్రివిక్రమ్ ఈసారి సునీల్ ను ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో నటింపచేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి సునీల్ ఇప్పటికే కమెడియన్ గా మరియు హీరోగా బాగానే ప్రూవ్ చేసుకున్నాడు.

కానీ ఇటీవల సునీల్ హీరోగా నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి.దాంతో సునీల్ ఈ మధ్య కేవలం హీరో పాత్రల పైనే కాకుండా స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా నస్తుటిన్నాడు. అయితే ప్రస్తుతం సునీల్ నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి “కలర్ ఫోటో” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా మిగిలి ఉన్న షూటింగ్ పనులను కొంతకాలం పాటు తాత్కాలికంగా చిత్ర యూనిట్ సభ్యులువాయిదా వేశారు.

error: Content is protected !!