మామను మించిపోయిన అక్కినేని కోడలు…ఏమి చేస్తుందో చూడండి

సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్ గా రాణించడం కష్టమే కానీ అక్కినేని కోడలు సమంత విషయంలో అందుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, కొందరు హీరోయిన్స్ మొండిపట్టు పట్టి నట వృత్తిని కొనసాగించడం చాలా కష్టం. దీనివలన ఫ్యామిలీ బ్రేకప్ కి కూడా చోటుచేసుకున్నాయి. ఇక గ్లామర్ ఎలివేషన్ తో పని లేకుండా.. సాంప్రదాయ బద్ధంగా లేడీ ఓరియెంటెడ్ కథాంశాల్ని ఎంచుకుని సీరియస్ థ్రిల్లర్ డ్రామాల్లో నటించడం ద్వారా కొందరు నెట్టుకొస్తున్నారు. అయితే ఈ పంథాలో వెళుతూనే వీలున్నంతవరకూ గ్లామర్ ఎలివేషన్ చేస్తూ ఎంతో తెలివిగా పాత్రల సెలక్షన్స్ తో అక్కినేని కోడలు సమంత సాగిస్తున్న నటయాత్ర హాట్ టాపిక్ అయింది. ఈ భామ గత చిత్రాల్ని పరిశీలిస్తే ఓ బేబి- యూటర్న్ లాంటివి ఈ తరహా మూవీస్ అని చెప్పాలి. ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని లేడీ ఓరియెంటెడ్ కి స్టిక్ అయితే మంచి ఫలితం వస్తుందని ఓ బేబి ప్రూవ్ చేసింది.

మరోపక్క భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ మరపురాని సక్సెస్ గా నిలవడంతో తనలో కాన్ఫిడెన్స్ మరింత పెంచేసింది. ఇక వీటన్నిటికీ డిఫరెంటుగా ఆలోచిస్తూనే అటు తమిళ పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్ని ఎంపిక చేసుకుని సమంత షాకిచ్చింది. అక్కడ సేతుపతి సరసన చేసిన బ్లాక్ బస్టర్ సినిమా అలాంటిదే. ఇప్పటి కిప్పుడు సమంత రెండు చిత్రాల్లో చేస్తోందని టాక్ వచ్చింది. విజయ్ సేతుపతి – విఘ్నేష్ శివన్ కాంబినేషన్ మూవీ.. అలాగే గేమ్ ఓవర్ దర్శకుడు అశ్విన్ శరవణన్ తో వేరొక మూవీకి సంతకం చేసినట్లు తెలుస్తోంది. కానీ కరోనా లాక్ డౌన్ పరిణామాలతో ఆ సినిమాల నుంచి సామ్ తప్పుకుందన్న ప్రచారం వచ్చేసింది.

అలాగని సమంత ఖాళీగా ఏమీలేదు. తెలుగులో పలు స్క్రిప్టులు ఆమె కోసం రెడీ అవుతున్నాయి. వీటితో పాటే సోనీపిక్చర్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుందన్న విషయం తాజాగా తెరపైకొచ్చింది. . తెలుగు-తమిళం-కన్నడ-మలయాళం- హిందీలో తెరకెక్క నున్న ఈ మూవీ బహుభాషా చిత్రం. ఒక రకంగా పాన్ ఇండియా చిత్రం అనే ప్రచారం నడుస్తోంది. ఇక ఓటీటీ ప్రాజెక్ట్ పైనా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ లో క్రేజీ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2` లో నటించిన సమంత కి ఇది మరో భారీ డీల్ అంటున్నారు. పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

error: Content is protected !!