వై ఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ సూపర్ సక్సెస్..!

వైసీపీ పార్టీ అధినేత మరియు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూనే తాను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

అలా చేప్పట్టిన ఓ అంశంలో మొదట అనేక విమర్శలు వచ్చినప్పటికీ అందులో సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతం కరోనా వల్ల అనేక రంగాలు స్తంభించిపోయాయి వాటిలో మద్యం కూడా ఒకటి. అయితే మన దగ్గర కూడా ఇతర రాష్ట్రాల వలె మద్యం షాపులు ఓపెన్ చేశారు. మొదటి రోజునే 25 శాతం పెంచి ఓపెన్ చేయగా అనేక విమర్శలు తలెత్తాయి.

దానితో తర్వాత రోజు ఏకంగా ఇంకో 50 శాతం పెంచేసరికి మొత్తం 75 శాతానికి పెరిగిపోయింది. అయినప్పటికీ విమర్శలు తగ్గలేదు.రేట్ లు పెంచినంత మాత్రాన మందు బాబులు కొనకుండా ఉంటారా అలా ఉండరు నిజంగా మద్యపాన నిషేధం చేసే ఉద్దేశ్యం జగన్ కు ఉంటే అసలు తెరవకూడదు కదా అని అన్నారు.

కానీ జగన్ వేసే ప్లాన్ ప్రకారం ఆదాయంతో పాటు మద్యం తాగేవారు కూడా బాగా తగ్గినట్టుగా గ్రౌండ్ రిపోర్ట్. పట్టణాల్లో ఏమో కానీ గ్రామ స్థాయిలో అయితే వైన్ షాపులు అంటేనే జనం భయపడిపోతున్నారు. దీనితో ఆదాయంతో కూడిన మద్యపాన నిషేధం అనే ప్లాన్ వేసి జగన్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

error: Content is protected !!