ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం – ఫించన్ల పంపిణీ పై ఆలోచనలు…

రాష్ట్రంలో విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఒకవైపు కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే, మరొక వైపు రాష్ట్ర ప్రజలందరికి కూడా కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. కాగా రాష్ట్రంలో తాజాగా ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది.కాగా ఈ క్రమంలో ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అందుకు సంబందించిన ఆదేశాలను కూడా జారీ చేసింది.

కాగా ఒకే కుటుంబంలో ఎవరైనా రెండు ఫించన్లను తీసుకుంటే, వారికి ఒక ఫించన్ ని రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాకుండా దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్‌హెచ్‌వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రజలకు సంబందించిన ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో తప్పుడు లెక్కలు చూపిస్తూ రెండేసి ఫించన్లను పొందుతున్నవారి వారి వివరాలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు సేకరించారు. వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పురపాలక కమిషనర్ లేదా ఎంపీడీవోలకు పంపించింది.

error: Content is protected !!