అఖిల్ సినిమా పరిస్థితి ఏమిటి…నాగార్జున అసంతృప్తిగా ఉన్నాడా…?

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు స్థంబించినట్టుగానే సినీ రంగం కూడా మూతపడిపోయింది. దీంతో అఖిల్ మూవీ కూడా ఇంకా కొంచెం షూటింగ్ మిగిలివుండగా ఆగిపోయింది. ఇక ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ హేండిల్ చేయడం వలన ఇండస్ట్రీలో టాక్ కూడా బానే వచ్చింది.

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీసుకువచ్చేందుకు బొమ్మరిల్లు భాస్కర్ కసరత్తు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రషెష్ చూసాక నాగార్జునకు అంతగా నచ్చలేదట. అందుకే రీ షూట్ చేయాలనీ కోరినట్లు వార్తలు వైరల్ వవుతున్నాయి. ఊహించిన రేంజ్ లో తీయలేదన్న అసంతృప్తి నాగ్ లో ఉందట.

అయితే నాగ్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదని డైరెక్టర్ భాస్కర్ కొట్టిపారేశాడు. అనుకున్నట్టుగా వచ్చిన ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా బానే ఉన్నట్లు చిత్ర యూనిట్ చెబుతోందని భాస్కర్ అంటున్నాడు. ఇక భాస్కర్ పనితనం పట్ల నాగ్ కూడా సానుకూలంగానే ఉన్నాడని అంటున్నారు. హిట్ లక్ష్యంగా నడుస్తున్నారని అంటున్నారు.

error: Content is protected !!