నవరత్నాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఏంటో తెలుసా…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో అధికార వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రధానమైన నవరత్నాలను ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా అందుకు గాను భూములను వేలం వేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. కాగా ఈ ప్రక్రియకు గాను మొదటగా విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఈ నెల 29న ఈ ఆక్షన్ ప్రక్రియ ద్వారా వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా ఈ భూములను వేలం వేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రంలో నవరత్నాలు, నాడు-నేడు వంటి కార్యక్రమాల అమలుకు ఉపయోగించనున్నారు. ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ మేరకు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహించే ఈ వేలంపాటలో అందరు పాల్గొనవచ్చని వెల్లడించారు. కాగా వేలం వేయాలనుకున్న తొమ్మిది స్థలాలకు రిజర్వ్ ధరగా రూ. 208.62 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

వేలం వేసే భూముల వివరాలు :

గుంటూరు జిల్లా:
నల్లపాడు – 6.07 ఎకరాలు
శ్రీనగర్ కాలనీ – 5.44 ఎకరాలు
మెయిన్ బీటీ రోడ్డు – 1.72 ఎకరాలు

విశాఖ జిల్లా:
చిన గడ్లీ – 1 ఎకరం
చిన గడ్లీ – 75 సెంట్లు
ఆగనంపూడి – 50 సెంట్లు
ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ – 35 సెంట్లు
ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ – 1.93 ఎకరాలు
ఫకీర్ టకియా ఎసీఈజెడ్ – 1.04 ఎకరాలు

error: Content is protected !!