ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం – ఏంటో తెలుసా…?

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత బీభత్సంగా పెరిగిపోతున్న కారణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కరోనా నివారణ చర్యల్లో ప్రధానమైన లాక్ డౌన్ ని రాష్ట్రవ్యాప్తంగా చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో సర్వం మూతబడ్డాయి. ఏ ఒక్క సర్వీసులు కూడా తెరుచుకోలేదు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతున్న కారణంగా కేంద్రప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రంలో లాక్ డౌన్ నుండి క్రమక్రమంగా చాలా సడలింపులు చేస్తు, కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుండి మినహాయింపులు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

కాగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఆలయాలను తిరిగి తెరవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో ఆలయాలు తెరిచిన తరువాత భక్తులు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, భౌతిక దూరం మొదలగు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా దర్శనానికి సంబంధించిన టైం స్లాట్‌ను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. కానీ ఎవరైనా ఆలయాల్లో ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.

error: Content is protected !!