గబ్బర్‌సింగ్‌ అంత్యాక్షరి ఐడియా ఎవరిదో తెలుసా ?

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో టాప్‌ చిత్రాల జాబితాలో గబ్బర్‌ సింగ్‌ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ సినిమా షూటింగ్‌ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ స్క్రిప్ట్‌ విషయంలో మరియు స్క్రీన్‌ప్లే విషయంలో పలు సలహాలు సూచనలు చేయడం జరిగింది.అంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ చేసిన వరుస నాలుగు సినిమాలు డిజాస్టర్‌ అయ్యాయి.అందుకే ఈ సినిమాపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాడు.స్క్రీన్‌ప్లే చర్చల సమయంలో పలు కీలక మార్పులు చేర్పులను చెప్పాడు.

గబ్బర్‌సింగ్‌ చిత్రం విడుదలై ఎనిమిది ఏళ్లుఅయిన సందర్బంగా ఆ చిత్ర విశేషాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.సినిమా విడుదల సమయంలో మొదట మిశ్రమ స్పందన దక్కించుకున్నా ఆ తర్వాత సినిమాకు బ్లాక్‌ బస్టర్టాక్‌ వచ్చింది.ఏకంగాఇండస్ట్రీ హిట్ కొట్టింది.అంతటి విజయానికి ప్రధాన కారణం సినిమాలోని అంత్యాక్షరి సీన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ కామెడీ సన్నివేశంను పవన్‌ స్వయంగా సూచించాడట.

సాదా సీదాగా ఆ ఎపిసోడ్‌ను పూర్తి చేయాలనుకుని దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్‌లో అనుకున్నాడు.కాని పవన్‌ కళ్యాణ్‌ ఆ సమయంలో రౌడీ గ్యాంగ్‌తో అంత్యాక్షరి ఆడితూ వారి నుండి నిజం రాబడితే బాగుంటుందనే అభిప్రాయంవ్యక్తం చేశాడు.ఆ నిర్ణయం అందరికి నచ్చడంతో దాన్నే ఫాలో అయ్యారు.పవన్‌ సూచనతోనే సినిమా అంతటి హిట్‌ అయ్యిందంటూ దర్శకుడు హరీష్‌ శంకర్‌ కూడా పలు సందర్బాల్లో సన్నిహితుల వద్ద అన్నాడట.

error: Content is protected !!