వారి కోసం జగన్ సంచలన నిర్ణయం..!

వైసీపీ పార్టీ అధినేత మరియు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఒక పక్క కరోనా బారి నుంచి కాపాడుకునే చర్యలలోనే కాకుండా తాను ఇచ్చిన హామీలను కూడా ఏకకాలంలో నెరవేర్చే దిశగా దూసుకుపోతున్నారు. దీనితో అనేక విమర్శలు వచ్చిపడుతున్నప్పటికీ తనదైన శైలి నిర్ణయాలతో జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు.అలాగే పలు సున్నిత అంశాల్లో అయితే తాను తీసుకునే నిర్ణయాల చేత తన ఉదార స్వభావాన్ని బయటపెట్టుకుంటున్నారు.

అందులో భాగంగానే తీసుకున్న ఓ సంచలన నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ హర్షించక తప్పదు. ఈరోజు కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏర్పాటు చేసిన మీటింగులో స్వస్థలాలకు వెళ్లే కార్మికుల కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఎవరైతే కాలి నడకన సొంత రాష్ట్రాలకు వెళ్లినట్టు కనిపిస్తారో వారికి ఉచిత రవాణా సౌకర్యాన్ని కలిపించబోతున్నామని తెలిపారు.అలా కనిపించే వారిని బస్సు ఎక్కించి వారి స్వస్థలాలకు చేరవేసేలా పని చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

error: Content is protected !!