పవన్ కళ్యాణ్ పాలిట శాపంగా మారిన కరోనా

మహమ్మారి కరోనా ఎవరినీ ఒదలడం లేదు. బీదా బిక్కి, రాజు పేద అన్న తేడా లేకుండా అందరినీ కమ్మేస్తోంది. తాజాగా కరోనా మహ్మామ్మారి పవన్ కళ్యాణ్‌ను కూడా ఒదలలేదు. అవును,రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో వేసుకున్న ప్లాన్స్‌ను కరోనా మహామ్మారి చెడగొట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అప్పట్లో తాను మళ్లీ సినిమాల్లో నటించనని.. తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తాని చెప్పాడు. కానీ పార్టీ నడిపించడానికి డబ్బుల అవసరం దృష్ట్యా తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. అందుకే సినిమాల్లో నటించడం తప్పించి మరో మార్గం లేదని ప్రకటించాడు.

ఒకవేళ ఈ మహామ్మారి రాకపోయి ఉంటే.. ఈయన హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలైన ఉండేది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వకీల్ సాబ్‌ మే 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. కానీ కరోనా వైరస్ మహామ్మారి తీవ్రతను కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా కారణంగా ఇప్పటికే మూడు సార్లు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఇపుడు మరోసారి పొడిగింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తే.. చూడాలకునే అభిమానులు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించి వకీల్ సాబ్ సినిమా గబ్బర్ సింగ్ విడుదలైన నెలలో విడుదలవుతుందని అభిమానులు ఆశించారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇలియాను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కరోనా ఎఫెక్ట్‌ పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా విడుదల కాకపోవడంతో ‘ కరోనా నువ్వు లేకపోయి ఉంటే ఈ రోజు థియేటర్స్‌లో సందడి చేసేవాళ్లం’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విడుదల చేయడం లేనందున కనీసం టీజర్ అయిన విడుదల చేసి పుణ్యం కట్టుకోండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!