పవన్ కోసం చరణ్’’ డ్రైవింగ్ లైసెన్స్’’ తీసుకోబోతున్నాడా..?

మన తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ ల హవా కొనసాగుతోంది . ఒక భాషలో హిట్ అయిన సినిమా ను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్ . ఆల్రెడీ హిట్ అయిన సినిమా కావడంతో ఎలాంటి రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. రీమేక్లు హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెడుతుంటాయి. అందుకే ఇతర భాషల్లోహిట్ అయినా సినిమాల , రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా, మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ హిందీ లో హిట్ అయినా ‘’ పింక్ ‘’ రీమేక్ ‘’ వకీల్ సాబ్’’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మరో మలయాళ చిత్రం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి, పోయిన సంవత్సరం మలయాళంలో వచ్చిన ‘’ డ్రైవింగ్ లైసెన్స్ ‘’ అనే సినిమా అక్కడ మంచి విజయాన్ని పొందింది. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. పృద్వి రాజ్ మరియు సూరజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ ‘’డ్రైవింగ్ లైసెన్స్ ‘’రీమేక్ రైట్స్ రామ్ చరణ్ పోటీపడి మరీ కొన్నాడట .ఇప్పటికే ఓ మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ రైట్స్ చరణ్ దగ్గర ఉన్నాయి. ఈ చిత్రo తన తండ్రి చిరంజీవి చేయనున్నాడు. తాజా గా’’ డ్రైవింగ్ లైసెన్స్’’ చిత్రాన్ని తన బాబాయి పవన్ కళ్యాణ్ తో తన సొంత సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాలని చరణ్ అనుకున్నాడట. ఈ మలయాళ చిత్రం లో నటించేందుకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.

పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఈ స్టోరీని తయారు చేస్తున్నారట. అయితే ఈ మలయాళ చిత్రం ఓ కీలక పాత్ర ఉంటుంది. ఈ పాత్ర చేయడానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజం అయితే మెగా హీరోలు పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ఒకే సినిమాలో చూసే అవకాశం దక్కుతుంది. ఒకవేళ తేజ్ తో కుదరకపోతే విక్టరీ వెంకటేష్ తో ఈ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఆల్రెడీ పవన్ వెంకీ ఓ సినిమా కలిసి నటించారు. డ్రైవింగ్ లైసెన్స్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ పవన్ కుచూపించాలని చరణ్ అనుకుంటున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే .

error: Content is protected !!