ఎన్టీఆర్ నో చెప్పితే పవన్ ఒకే చేశాడా….ఆ సినిమా ఏమిటో తెలుసా?

ఒకరికి నచ్చిన కథ మరొకరికి నచ్చక పోవచ్చు,ఒకరు ఒకే చేస్తే,మరొకరు నో చెప్పొచ్చు . కానీ అల్టిమేట్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమా హిట్ గానీ,డిజాస్టర్ గానీ ఆధారపడి ఉంటుంది. నో చెప్పిన కథను మరో హీరో ఒకే చేసి, సినిమా తీసి హిట్ కొడితే ఆ మజా వేరుగా ఉంటుందని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీలో వరసగా సినిమాలను ఒప్పుకుంటూ జోరు చూపిస్తున్నాడు. మొదటగా ఒప్పుకున్నా పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చివరి దశ షూటింగ్ లో ఉండగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రం కూడా సెట్స్ పై వచ్చేసింది.

ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఫాన్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అయితే ఈ కథ గురించి సినీవర్గాలలో ఒక ఆసక్తికరమైన రూమర్ చక్కర్లుకొడుతోంది. అదేమిటంటే, ఈ కథను హరీష్ మొదట ఎన్టీఆర్ కు వినిపిస్తే, పెద్దగా నచ్చకపోవడంతో నో అన్నాడట.

అయితే ఎన్టీఆర్ మరో కథను ఓకే చేసాడట. అప్పుడు ఎన్టీఆర్ ఓకే చెప్పిన కథే ‘రామయ్యా వస్తావయ్యా’. ఆ సినిమా ఫలితం అందరం చూసిందే. అప్పుడు ఎన్టీఆర్ నో చెప్పిన కథకు హరీష్ మార్పుచేర్పులు చేసి పవన్ కు వినిపించారట. పవన్ ఈ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. డైరెక్టర్ తయారు చేసుకున్న ఒక కథ ఒక హీరో నుంచి మరో హీరోకు చేరడం ఇండస్ట్రీలో మామూలే. ఈసారి పవర్ స్టార్ కోసం హరీష్ ఎలాంటి కథ తయారు చేశారో మరి. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని ఈమధ్య వచ్చిన కొన్ని వార్తల్లో నిజంలేదని, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని హరీష్ క్లారిటీ ఇచ్చారు.

error: Content is protected !!