అక్కినేని హీరోలు అక్కడితో ఆగిపోయారా… ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా?

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని అంటేనే ఓ బ్రాండ్. అక్కినేని నాగేశ్వరరావు వేసిన పునాది అలాంటిది మరి. ఆయన వారసునిగా నాగార్జున అప్పట్లో ఎంట్రీ ఇచ్చి,ఎన్నో హిట్స్ కొట్టాడు. టాలెంట్ తో ఎదిగి, టాలీవుడ్ సినియర్ స్టార్ హీరోల జాబితాలో నాగార్జున పేరు ముందు వరుసలో చేరాడు. నాగ్ తోటి హీరోలకు అప్పట్లో గట్టి పోటీ ఇచ్చేవాడు. ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను చేసిన నాగార్జునకు వంద కోట్ల మార్క్ అనేది సాధ్యం కాలేదు. ప్రస్తుతం హీరోలు అంతా కూడా వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్నారు.

కనీసం ఒక్క వంద కోట్ల సినిమా అయినా చేయాలని ఆశ. నాగార్జున అప్పట్లో పోటిపడ్డ హీరోలు ఏదో విధంగా వంద కోట్లను టచ్ చేశారు. యంగ్ స్టార్ హీరోలకు ఈమద్య కాలంలో వంద కోట్ల బిజినెస్.. వంద కోట్ల వసూళ్లు అనేది చాలా కామన్ గా మారిపోయింది. నాగార్జున అలాంటి క్రెడిట్ కొట్టకపోయినా కనీసం ఆయన నట వారసులయినా వంద కోట్ల జాబితాలో చేరుతారేమో అనుకుంటే వారు కూడా సక్సెస్ ల కోసం కిందా మీద పడుతున్నారు.

అఖిల్ పై చాలా ఆశలు పెట్టుకుంటే, ఇంకా మొదటి సక్సెస్ కోసం ఎదురు చూడ్డమే సరిపోతోంది. మరోపక్క నాగచైతన్య నుండి మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో ఒక కుటుంబం అయిన అక్కినేని కుటుంబం కనీసం ఒక్కటి అంటే ఒక్కటి కూడా వంద కోట్ల సినిమా లేక పోవడం సిగ్గు చేటు అంటూ యాంటీ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా అఖిల్ ప్రస్తుతం ఉన్న యువ హీరోలకు ధీటుగా నిలవడంతో పాటు రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న నటుడు అఖిల్ అనే నమ్మకం ఉంది.

error: Content is protected !!