రాహుల్ గుండు వెనక ఆ హీరోయిన్ ఉందట …ఎవరో తెలుసా?

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాహుల్.. గుండుతో కనిపించడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ లుక్ షేర్ చేసిన ఆయన.. ‘ఇది గుండుతో హల్చల్ చేయాల్సిన సమయం’ అని ట్యాగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ లుక్ ఓ హీరోయిన్ కోసం అనే న్యూస్ బయటకొచ్చింది. కేవలం ఆమె కోసమే రాహుల్ ఈ అవతారమెత్తాడని అంటున్నారు.

దీంతో ఈ గుండు లుక్ ఎందుకు? ఉన్నట్టుండి ఎందుకిలా మారాడు ఆమె కోణంలో విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు శివాత్మికతో కలిసి అలరించేందుకే ఆయన ఈ లుక్ లోకి వచ్చాడనే సమాచారాలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో రోల్ కోసం రాహుల్ లుక్ మార్చేశాడని టాక్. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో శివాత్మిక జోడీగా రాహుల్ నటిస్తున్నాడు. రాహుల్ గుండు వెనుక ఆమె పాత్ర ప్రభావం ఉంటుందని, వీళ్లిద్దరి క్యారెక్టర్స్ సినిమాకే పెద్ద అసెట్ అవుతాయని తెలుస్తోంది. మొత్తానికైతే రాహుల్ గుండు లుక్, ఆ రహస్యం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం కావడం విశేషం.

error: Content is protected !!