బిగ్ బాస్ 4 హోస్ట్ ఎవరో తెలుసా…ఆ స్టార్ హీరో అట

తెలుగు నాట, సూప‌ర్ రేటింగుల‌తో, ఇంటిల్లిపాదినీ ఆక‌ట్టుకున్న రియాలిటీ షో.. బిగ్ బాస్. సెల‌బ్రెటీల‌ను కంటెస్టెంట్లుగా చేసి, ఓ స్టార్ హీరో హోస్ట్‌గా రావ‌డం వ‌ల్ల ఈ షోకి ఆద‌ర‌ణ పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన మూడు సీజ‌న్లూ సూప‌ర్ హిట్టే. తొలి సీజ‌న్‌లో హోస్ట్‌గా వ‌చ్చిన ఎన్టీఆర్‌.. త‌న వాక్ చాతుర్యంతో షోని ర‌క్తి క‌ట్టించాడు. ఆ త‌ర‌వాత నాగార్జున‌, నానిలు హోస్ట్‌లుగా మారారు. ముగ్గురిలో ఎక్కువ మార్కులు ఎన్టీఆర్‌కే ప‌డ‌తాయి. బిగ్ బాస్ 4కి మ‌ళ్లీ ఎన్టీఆరే హోస్ట్ గా వ‌స్తాడ‌ని అనుకున్నారంతా. కానీ.. ఇప్పుడు నాగార్జున‌కు ఆ స్థానం ఖాయ‌మైంద‌ని తెలుస్తోంది. దానికి కూడా కరోనానే కార‌ణం. లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి.

ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్ నిలిచిపోయింది. దాంతో ఎన్టీఆర్ షెడ్యూల్‌, ప్లానింగ్ అంతా అస్త‌వ్య‌స్థ‌మైంది. అందుకే.. ఈ షో చేయ‌లేక‌పోతున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు నాగార్జున కొత్త‌గా ఒప్పుకున్న సినిమాలేం లేవు. త‌న‌కు కావ‌ల్సినంత స‌మ‌యం ఉంది. పైగా మా టీవీ సొంత చాన‌ల్ లాంటిది. అన్న‌పూర్ణ ఏడు ఎక‌రాల్లో బిగ్ బాస్ సెట్ వేశారు. సో… తాను సొంతింట్లో ప‌ని చేసుకున్న‌ట్టే. అందుకే నాగ్ ఈ షో చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే.. ఈ షో విష‌యంలో ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

error: Content is protected !!