నాగబాబు స్టేట్మెంట్ తో సంబంధమే లేదు పవన్ సంచలనం.!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యి నేటితో సంవత్సరం పూర్తయ్యింది. ఈ అంశం ఇప్పుడు జనసేన శ్రేణుల్లో హాట్ టాపిక్ కాగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సంచలన స్టేట్మెంట్ ఇప్పుడు కాక రేపుతోంది.

తాజాగా పవన్ సోదరుడు మరియు జనసేన పార్టీలో కీలక నేత నాగేంద్ర బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఓ ట్వీట్ పెను ధుమరమే రేపింది. దీనితో దాని ఎఫెక్ట్ కాస్త జనసేన పార్టీపై పడడంతో నేడు పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక సంచలన స్టేట్మెంట్ జనసేన పార్టీ తరపున విడుదల చేసారు.

తమ పార్టీకి వ్యక్తులు అయినప్పటికీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు తన పార్టీకు సంబంధించినవి కావని అదే విధంగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఆయన వ్యక్తిగతం మాత్రమే తప్ప వాటికి తన పార్టీకు ఎలాంటి సంబంధము లేదని ఖరాఖండిగా చెప్పేసారు. ఇది కరోనా కష్టకాలం కావున ప్రతీ ఒక్కరూ ప్రజాసేవలో పాల్గొనాలి అని సూచించారు.

error: Content is protected !!