మెగాస్టార్ సినిమాలో విజయశాంతి…ఈ వార్తలో నిజం ఎంత?

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని.. సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్‌ వినిపించాడని, ఫైనల్ గా చిరు కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఉంటాయట.

error: Content is protected !!