రవితేజ,తమన్నా మధ్య గొడవ ఏమిటో తెలుసా ?

ర‌వితేజ – త‌మ‌న్నా చేసిన ఒకే ఒక్క సినిమా `బెంగాల్ టైగ‌ర్`. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌లేదు. కానీ.. ఈమ‌ధ్య ఓ సినిమా కోసం త‌మ‌న్నాని సంప్ర‌దిస్తే ‘ర‌వితేజ‌తో చేయ‌ను’ అనేసింద‌ట‌. ఆ విష‌యం ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ర‌వితేజ‌కూ త‌మ‌న్నాకూ మ‌ధ్య గొడ‌వేంటి? ఈ సినిమాని ఎందుకు ఓకే చేయ‌లేదు.. అనే విష‌యంలో హాట్ హాట్ గా చ‌ర్చించుకున్నారు.

ఎట్ట‌కేల‌కు దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించింది. ర‌వితేజ‌తో త‌న‌కు ఎలాంటి గొడ‌వ‌లూ లేవ‌ని, త‌న‌కిష్ట‌మైన కో స్టార్ ర‌వితేజ అని, త‌న‌తో మ‌రో ప‌ది సినిమాలు చేయ‌డానికైనా తాను రెడీ అని స్ప‌ష్టం చేసింది. ఓ సినిమా వ‌దులుకోవ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉంటాయ‌ని, అవ‌న్నీ చెప్పుకోలేమ‌ని, అంతే త‌ప్ప‌… ఏ కో స్టార్‌తోనూ తాను ప‌నిచేయ‌నిని ఎప్పుడూ చెప్ప‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది. ”ఒక్కోసారి క‌థ న‌చ్చితే పాత్ర న‌చ్చ‌దు. పాత్ర న‌చ్చితే క‌థ న‌చ్చ‌దు. అన్నీ న‌చ్చినా కాల్షీట్లు కుద‌ర‌వు. అలాంట‌ప్పుడే సినిమాని వ‌దులుకుంటాం. దాంట్లో ర‌క‌ర‌కాల కోణాలు వెత‌క‌డం క‌రెక్ట్ కాదు..” అని చెప్పుకొచ్చింది త‌మ‌న్నా. సో.. ర‌వితేజ‌తో త‌మ‌న్నాకు గొడ‌వ‌లేం లేవ‌న్న‌మాట‌.

error: Content is protected !!