తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన జబర్దస్త్ భామ

తెలుగు బుల్లితెరపైకి వచ్చిన ఆదిలోనే ఓ వెలుగు వెలిగిన యాంకర్ అనసూయ భరద్వాజ్. ఎన్నో సినిమాల్లో అప్పటికే నటించినప్పటికీ ఈటీవీ ఛానెల్లో ప్రసారం కాబడిన “జబర్దస్త్” కామెడీ షో ద్వారానే ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. అలా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ తన సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో మంచిగా మమేకం అవుతుంటారు.

అలా తాను పెట్టిన ఇన్స్టాగ్రామ్ సెషన్ లో ఓ ఫాలోవర్ మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడగ్గా దానికి రిప్లైగా ఓ వింటేజ్ ఫోటోను పెట్టి అతనే తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారు. ఇంతకీ తనతో పాటు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు అనసూయ భర్త సుశాంక్ భరద్వాజే..తనతో కలిసి ఉన్న ఓ ఫోటోను పెట్టి అతనే తనకి “ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడూ రాబోయే రోజుల్లోనూ ఎప్పటికీ ఉండే బాయ్ ఫ్రెండ్ అతను నా లైఫ్ లో అలా స్టక్ అయ్యి ఉండిపోయాడు పాపం ” అంటూ రిప్లై ఇచ్చారు.

error: Content is protected !!