వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరో సినిమాతో “స్టార్ మా”

ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకోవడంలో స్టార్ మా ఛానెల్ కూడా కాస్త ముందు వరుసలోనే ఉందని చెప్పాలి. కేవలం మాములుగా కొత్త సినిమాలతో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఒకెత్తు అయితే ఊహించని విధంగా హాలీవుడ్ సినిమాలను హిందీ సినిమాలను అలాగే పలు రీసెంట్ చిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం మరో ఎత్తు. అలా తాజాగా 7 మరియు నందిని నర్సింగ్ హోమ్ అనే రెండు సినిమాలను స్టార్ మా వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నారని ప్రకటించారు.

ఇప్పుడు మళ్ళీ అలాంటి మరో చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యనున్నారు. ధనుష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రభు సాలోమన్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ చిత్రం “రైల్” ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు వచ్చిందో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనుంది. వచ్చే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ లాక్ డౌన్ లో ఇది కూడా మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.

error: Content is protected !!