ఇకపై వారికి క్వారంటైన్ 14 రోజులు కాదు 7 రోజులే..!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపధ్యంలో అంతర్జాతీయ విమానాలను కూడా నిలిపివేయడంతో అనేక మంది ఇతర దేశాలలో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ 4లో కేంద్ర ప్రభుతం వారందరిని వందే భారత్ పేరుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అలా తిరిగివచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా ఇకపై దానిని 7 రోజులకు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ కోసం హోటల్స్‌కి చెల్లించిన అడ్వాన్స్‌లో 7 రోజుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.

error: Content is protected !!