వినాయక్ మూవీపై అంత బడ్జెట్ అవసరమా…దిల్ రాజు దైర్యం ఏమిటో…?

సినిమా తీయడం అనేది పక్కా ప్లాన్ తో చేయాలి. అందునా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెరిగిపోయింది. దాంతో పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అనే ఆలోచన ఎక్కువైంది. ముఖ్యంగా ఒక సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి అనే విషయం ఎప్పుడూ పెద్ద చర్చకు దారితీస్తూనే ఉంటుంది. కథ ప్రకారం అని కొందరు వాదిస్తారు కానీ అలా చేస్తే ఎక్కువ సందర్భాలలో నిర్మాతకు నష్టాలు తప్పవు. ప్రాక్టికల్ గా అయితే హీరో మార్కెట్.. దర్శకుడి సత్తాను బట్టే బడ్జెట్ పెట్టాలి. అలా కాకుండా తోచిన బడ్జెట్ పెట్టేస్తే వెనక్కు రాని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే, తాజాగా వీ.వీ. వినాయక్ హీరోగా పరిచయం అయ్యే సినిమా బడ్జెట్ అలాగే ఎక్కువైందని అంటున్నారు.

నిజానికి దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్లు అందించిన వీవీ వినాయక్ కెరీర్ గత కొంతకాలంగా తగ్గిపోయింది. ‘ఇంటెలిజెంట్’ పరాజయంతో పెద్ద హీరోలు ఎవరూ వినాయక్ తో సినిమా చేసేందుకు సాహసించలేదు. దీంతో వినాయక్ డైరెక్షన్ పక్కనబెట్టి హీరో గా మారి, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సీనయ్య’ సినిమాతో హీరోగా అదృష్టం పరిక్షించుకుంటు న్నాడు.

అయితే ఈ సినిమాకు పది కోట్లు బడ్జెట్ పెడుతున్నారని టాక్ . ఈమధ్య కొందరు మిడ్ రేంజ్ హీరోలు కూడా పది కోట్ల మార్క్ కలెక్షన్లు టచ్ కావడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. అలాంటిది వినాయక్ పైన పది కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద రిస్క్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ హీరో అయితే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని,అయితే మిడిల్ ఏజ్ లో ఉన్న వినాయక్ ను స్క్రీన్ పై చూస్తారా అనేది సందేహమే అని చాలామంది పెదవి విరుస్తున్నారు. మరి ఏ ధైర్యంతో దిల్ రాజు ఇంత బడ్జెట్ పెట్టేసాడా అని చెవులు కొరుక్కుంటున్నారు.

error: Content is protected !!