ప్రత్యేక హోదా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్!

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర అభివృద్ది సాధనకై మున్ముందు ఇంకా దూసుకు పోయేలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మన పాలన – మీ సూచన లో బాగంగా జరిపిన సమీక్ష లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామిక రంగం పై, అభివృద్ది చర్యల పై చర్చ జరిపారు. అయితే ఈ అంశం లో బాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి వివరించారు. ప్రత్యేక హోదా అంశం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోవుట వలన మనకి చాలా నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని, ఒక వేళ ఇస్తే ఎన్నో రాయితీలు ఇచ్చేవారు అని వ్యాఖ్యానించారు.పరిశ్రమల రాకతో పాటుగా, జీఎస్టీ లలో మినహాయింపు లు ఉండేవని అన్నారు.అయితే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో కలిసి పని చేసినా ప్రత్యేక హోదా రాలేదు అని టిడిపి ప్రభుత్వం పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.అయితే ప్రత్యేక హోదా విషయం లో ఎపుడు అవకాశం వచ్చినా అడుగుతూనే ఉంటా అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం లాగా అబద్ధాలు చెప్పను అని, ప్రత్యేక హోదా ఎప్పటికైనా సాధించి తీరుతాం అని అన్నారు.

error: Content is protected !!