వైరల్ అవుతున్న ఈ పిక్స్ ఏ స్టార్ హీరోవో తెలుసా?

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కొనసాగిస్తున్న లాక్ డౌన్ వలన ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంకా తెరుచుకోలేదు. దీంతో స్టార్ హీరోలు,హీరోయిన్స్ రకరకాల యాక్టివిటీస్ లో నిమగ్నమవుతున్నారు. ఇందులో భాగంగా చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తున్నారు. నిజంగా ఇవి ఒకప్పటి అందమైన జ్ఞాపకాలు. అందులో మనకు మనం చిన్నగా కనిపిస్తుంటే గత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో కనిపిస్తుంది.

ఇండస్ట్రీలోకి బాల నటుడిగానే వచ్చి.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి కి తగ్గ తనయుడిగా చిత్రసీమలో సత్తా చాటుతూనే మరోవంక తన కొడుకులను కూడా హీరోలుగా చేసి.. స్టార్స్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇన్నీ చెప్పాక అతనెవరో ఈజీగా తెలుస్తుంది. అతనెవరో కాదు కింగ్ నాగార్జున. ఈయన చిన్నపుడే తండ్రితో పాటు సినిమాల్లో నటించాడు. 1968లో విడుదలైన సుడిగుండాలు సినిమాలో నాగార్జున చిన్న పాత్రలో నటించాడు. బాల నటుడిగానే వచ్చి, తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆ సినిమా ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించాడు. అప్పట్లోనే మరో రెండు మూడు సినిమాలు చేసాడు. ఆ సినిమాలో విభిన్నమైన గెటప్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

error: Content is protected !!