‘సెవంత్ సెన్స్’ – ‘బందోబస్త్’ ద్వారా జరుగుతున్న విషయాలను ముందే చెప్పారా

ప్రపంచంలో కరోనా మహమ్మారి తన ఉధృతాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఎండలు కూడా దంచేస్తున్నాయి. వడగాడ్పులు జనం బయటకు రావద్దని అంటున్నారు. ఇక కరోనా విలయ తాండవం ఆగక ముందే మనదేశంలోని కొన్ని రాష్టాలలో మిడతల దాడి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. మన దగ్గర కూడా ఈ వైరస్ వలన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా వేల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రజలంతా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే స్టార్ హీరో సూర్య సినిమాల్లో జరిగినట్టే జరుగుతున్నాయని నెటిజన్లు జోరుగా చర్చిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే,.. 2011లో హీరో సూర్య – మురగదాస్ కాంబినేషన్లో ‘సెవంత్ సెన్స్’ సినిమా వచ్చింది. అందులో కూడా ఒక వైరాస్ భారత దేశాన్ని గడగడలాడిస్తుందని చూపించారు. చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ వైరస్ ఒక కుక్క ద్వారా ప్రజలందరికి వ్యాపింప చేస్తాడు. దానికి హీరో విరుగుడు కనిపెడతాడు. ఇప్పుడు కరోనా వైరస్ కూడా అలానే ప్రబలుతోంది. అచ్చం అలానే ఉన్నా, మందు మాత్రం కనిపెట్టలేదు. ఇక ఇదే సమయంలో భారత్ లోని కొన్ని రాష్ట్రాలను భయపెడుతోన్న మిడతల దండు ఒకటి.

పాకిస్థాన్ నుండి మిడతల దండు మనదేశంలోని కొన్ని రాష్ట్రాలపై దాడి చేస్తున్నాయి.మిడతల దండు పంట పొలాలను నాశనం చేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనదేశాన్ని దెబ్బ తీసేందుకు పాక్ ఈ మిడతల దండును మన పై వదిలిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవలే సూర్య నటించిన బందోబస్త్ సినిమాలో కూడా మిడత దండు గురించి ప్రస్తావించారు. అవి ఎలా పంటలపై దాడి చేస్తాయి . వాటివల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది వంటివన్నీ చూపించారు. ఇలా సూర్య నటించిన రెండు సినిమాల్లో రెండు వివత్తుల గురించి ప్రస్తావించడంతో సూర్య సినిమాలు ముందే చెప్పాయని నెటిజన్స్ అంటున్నారు. ఇంతకీ వీళ్ళకి ముందే ఎలా తెలిసిందబ్బా అని ట్రోల్స్ కూడా వేస్తున్నారు నెటిజన్స్ .

error: Content is protected !!