లాక్ డౌన్ సడలింపులో జగన్ సర్కార్ మరో నిర్ణయం.!

ఓ పక్క మన దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్నప్పటికీ జనాల పల్స్ ఆధారంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. దీనితో ఈ జనాన్ని కట్టడి చేయలేమని అర్ధం చేసుకొనే కొన్ని సడలింపులు పేరిట వారికి కొద్ది కొద్దిగా ఉపశమనం కలిగించడం మొదలు పెట్టారు. పలు ఆంక్షలతో సడలింపులు ఇచ్చారు.

అలా ఇప్పుడు తాజాగా జగన్ సర్కార్ మరిన్ని సడలింపులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ లోని ఆటోలు కార్లు మరియు ఇతర రవాణా వాహనాలకు అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే కంటైన్మెంట్ లో ఉన్న ప్రజలు మినహా ఇతర ప్రాంతాల వారికి ప్రయాణాల మినహాయింపు ఇచ్చారు. అలా ప్రయివేట్ వాహనాల్లో అయితే కేవలం 50 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేసారు.

error: Content is protected !!