లాక్ డౌన్ పేరుతో జబర్దస్త్ లో ఎమ్మెల్యే రోజాకు భారీ షాక్

ఈటీవీలో జబర్దస్త్ టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తూ, ఎవర్ గ్రీన్ షో గా నడుస్తోంది. అందుకే జబర్దస్త్ షో తెలుగు నాట బాగా నాటుకుపోయింది. అయితే ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు వెళ్లిపోయినా…ఎవరు కొత్తగా ఎంటర్ అయినా…స్థిరంగా కంటిన్యూ అవుతూ వచ్చింది మాత్రం ఎమ్మెల్యే రోజా మాత్రమే. ఈ షోలో జడ్జిగా ఆమె పోషించే పాత్ర చాలా ఎక్కువే. అటు రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే వైసిపి తరపున ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి సత్తా చాటింది. ఇక ఈ షోతో పాటు ప్రారంభమైన టీమ్ లీడర్లలో ఇప్పుడు రాకెట్ రాఘవ మాత్రమే ముందు నుంచి కంటిన్యూ అవుతున్నాడు. అలాగే యాంకర్ అనసూయ కూడా ముందు నుంచి కంటిన్యూ అవుతున్నప్పటికీ, మధ్యలో ఒక సారి జెండా ఎత్తేసి, మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

అయితే జడ్జిలలో రోజాతో పాటు కీలకంగా వ్యహరించిన నాగబాబు సుదీర్ఘంగా 7 సంవత్సరాల పాటు కొనసాగి, ‘అదిరింది’ అంటూ జీతెలుగులో సొంత కుంపటి పెట్టుకున్నాడు. అయితే ఎమ్మెల్యే రోజా ఒక్కరే షో స్టార్టింగ్ నుంచి ప్రస్తుత లాక్ డౌన్ లో షో బ్రేక్ పడే వరకూ జబర్దస్త్ లో కొనసాగింది.అయితే తాజాగా లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ షో నిరవధికంగా నిలిచిపోయింది. దీంతో మళ్లీ షూటింగులు మొదలయ్యే దాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చేసింది.

అయితే లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి రావడంతో వారు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రంగంలో ఏ ఎంటర్ టైన్ మెంట్ షోకు కూడా ఇవ్వనంత రెమ్యూనరేషన్ జబర్దస్త్ ఆర్టిస్టులు, జడ్జీలు, ఇతర రైటర్లు, సిబ్బంది పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ కానుంది. ఎందుకంటే కరోనా కాలంలో అడ్వర్టయిజ్ మెంట్లలో భారీగా గండి పడే చాన్స్ ఉంది. దీంతో భారీ పారితోషికాలు అందుకుంటున్న ఆర్టిస్టులను కాస్త తగ్గించుకోవాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా రెమ్యూనరేషన్ కూడా భారీగా కోత విధించే ఛాన్స్ ఉందట. కానీ ఆమె అభిమానుల కు ఇది చాలా బాధగా ఉందట.

error: Content is protected !!