ఆ హీరోను కియారా కొట్టేసిందట…నిజంగా…???

అందరి మాదిరిగానే సినీ ఇండస్ట్రీలో కూడా ఎవరినైనా కొట్టాలని అనిపిస్తే మాత్రం సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వచ్చినపుడు వదిలి పెట్టరు. అసలు విషయంలోకి వెళ్తే, గతంలో ఏబీసీడీ-2 సినిమా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న సంగతి తెల్సిందే. ఆ సినిమాలో వరుణ్ శ్రద్ధా కలిసి ‘సున్ సాథియా’ అనే పాటలో ఇద్దరు కలిసి స్టెప్పేసారు. అయితే అదే పాటకు ఇటీవలే హీరో వరుణ్ ధావన్, కబీర్ సింగ్ ఫేమ్ కియారా అద్వానీ కలిసి డాన్స్ రిహార్సల్ చేశారు.

అంతవరకూ బానే ఉంది. కానీ, .. వరుణ్ ని హీరోయిన్ కియారా అద్వానీ ముక్కుమీద కొట్టిందట. మరి వరుణ్ ఏమన్నాడు, అసలు అంత కోపం ఏంటి అమ్మడికి.. ఇలా సందేహాలు రావడం సహజమే. అయితే ఆ సందేహాలన్నింటికీ స్వయంగా వరుణ్ క్లారిటీ ఇచ్చేసాడు. ‘నన్ను ముక్కు మీద కియారా కొట్టింది వాస్తవమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు కోపంతో కాదు.. డాన్స్ రిహార్సల్ లో సరదాగా అలా జరిగిపోయింది’ అన్నాడు.

అయితే దెబ్బ తినేసాక ఇలాగే చెబుతారులే అనుకునేవాళ్లు ఎక్కువే. అందుకే ఎవరు నమ్మేలా లేరని.. వరుణ్ తాను చెప్పిన విషయాన్నీ వీడియో ప్రూఫ్ జతచేసి మరీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వరుణ్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కియారా అద్వానీ తనను ముక్కు మీద కొట్టిందని తెలిపాడు. ఏబీసీడీ-2 సినిమాలోని సున్ సాథియా సాంగ్ రిహార్సల్లో భాగంగా ఇది జరిగిందని, వీడియో ప్రూఫ్ చూపాడు. దాంతో వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ వీడియోలో వరుణ్ ధావన్ కియారా అద్వానీలు సాంగ్ కి అనుగుణంగా స్టెప్పులేశారు. అనుకోకుండా ఓ స్టెప్ వేసేటప్పుడు కియారా ముక్కుపై కొట్టింది.

error: Content is protected !!