భర్త సెల్వమణి చేతిలో దెబ్బతిన్న రోజా

రాజకీయాల్లో ,సినిమాల్లో,టివిలో ఇలా మూడు రంగాల్లో రాణించడం చాలా కష్టం. కానీ ఎమ్మెల్యే రోజా మాత్రం హీరోయిన్ గా, ప్రజా ప్రతినిధిగా, టీవీ వ్యాఖ్యతగా ఓ వెలుగు వెలుగుతూనే ఉంది. ఇక టాలివుడ్, బాలివుడ్ లలో చాలా మంది హీరోయిన్లు తాము ప్రేమించిన దర్శకులనే పెళ్లాడిన లిస్ట్‌లో రోజా కూడా ఉంది. తెలుగులో టాప్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు తమిళనాట సూపర్ స్టార్ రజినీ కాంత్, విజయ్ కాంత్ లతో నటించిన రోజా అప్పట్లో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. అయితే సినిమాల నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లో కాలుమోపిన రోజా ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చుకుంది. ఒకసారి ఓడిపోయినా,రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఎమ్మెల్యే గా ఉంటూనే మరోవైపు టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.

`చెంబరుతి` చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు రోజాని డైరెక్టర్ సెల్వమణి పరిచయం చేసాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో చామంతి మూవీగా డబ్ అయి, బాగా ఆడింది. ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్‌ సెల్వమణి, రోజా మధ్య ఏర్పడ్డ, పరిచయం ప్రేమగా మారి.. చివరకు మూడు ముళ్ల బంధంతో 2002లో ఒక్కటయ్యారు. అయితే రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసినప్పటికీ,వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం సస్పెన్స్ . వాస్తవానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పాడట.

రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు సెల్వమణి మనసులో మాట బయట పెట్టాడట. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమ కోసం చాలా కష్టపడిందట. అతడి కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్‌ను హ్యాపీగా రన్ చేస్తూ వస్తోంది. 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వయంగా రోజా నిర్మాతగా అందులో సుమన్, రోజా, రఘుమాన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ కె సెల్వమణి నిర్వహించగా, శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చరు. కాగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో రోజాకు ఆర్థిక నష్టాలు తప్పలేదు. ఇక్కడ మాత్రం భర్త వల్ల రోజా దెబ్బతింది.

error: Content is protected !!