RRR లో మరో స్టార్ హీరోయిన్…ఆ లక్కీ హీరోయిన్ ఎవరో…?

బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఆడియన్స్ ఎలాంటి మూవీ ఆశిస్తారో అతడి తెలుసు. అందుకే రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లతో మల్టీస్టార్ మూవీ అది కూడా ప్యాన్ ఇండియా మూవీ గా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే ఊహాజనిత కథతో రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

వేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయినట్టే టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అనేది అంతా ఈజీ కాదు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాను సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేసినట్టు టాక్. అయితే ఇందులో ఓ స్ఫెషల్ సాంగ్‌ను జక్కన్న ప్లాన్ చేసాడట. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ పై పిక్చరైజ్ చేయనున్నట్టు టాక్. ఇక రకుల్ కూడా రామ్ చరణ్‌తో బ్రూస్‌లీ, ధృవ సినిమాల్లో కలిసి యాక్ట్ చేసింది. ఈ సినిమాల్లో వీళ్లిద్దరి కెమెస్ట్రీకి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే రాజమౌళి ఈ సినిమాలో వీళ్లిద్దరిపై స్పెషల్ సాంగ్‌ ప్లాన్ చేసాడట.

ఇప్పటికే హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌కు అంతగా అవకాశాలు రాకపోవడంతో రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో రామ్ చరణ్ పక్కన ఐటెం సాంగ్ అనగానే ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ కూడా వస్తుందని అంటున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమాలో మిగతా యాక్షన్ పార్ట్‌ను కొద్ది మందితో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో పూర్తి చేస్తారట. తాజాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్‌కు కొన్ని షరుతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ త్వరలో మొదలు పట్టే ఛాన్స్ ఉంది.

error: Content is protected !!