“సాహో” వచ్చేది ఆ ఛానెల్లోనే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం “సాహో”. బాహుబలి తర్వాత తెరకెక్కి భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదలయ్యి మరోసారి సెన్సేషన్ రేపింది. కానీ ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

అయినప్పటికీ ఒక భారీ సినిమాకు వచ్చే రిపీట్ రెస్పాన్స్ ను కానీ ఆ హైప్ ను కానీ తెచ్చుకోగలిగింది. అందుకే ఈ సినిమా స్మాల్ స్క్రీన్ వెర్షన్ కోసం చాలా మందే ఎదురు చూసారు. అలా హిందీలో జీ సినిమా ఛానెల్లో ప్రసారం అయ్యి అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టుంది. దీనితో తెలుగు వెర్షన్ కోసం చాలా మందే ఎదురు చూసారు.

అయితే తెలుగులో ఈ చిత్రం జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అవుతుందనని గత కొన్ని రోజుల కితం పలు గాసిప్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం అదే ఛానెల్లో సాహో ఫిక్స్ అయ్యిపోయింది తెలుస్తుంది. అంతే కాకుండా అతి త్వరలోనే ఈ చిత్రం జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కావడం ఖాయం అని ఇప్పుడు సమాచారం.

error: Content is protected !!