జబర్ధస్త్ రెండో జడ్జిపై షాకింగ్ నిర్ణయం తీసుకున్న యాజమాన్యం

కామెడీ షో అనగానే అందరికీ ఠక్కున్న గుర్తొచ్చేది జబర్దస్త్ కామెడీ షోనే. ఈటీవీలో టాప్ రేటింగ్స్ తో మొదటి నుంచీ అదరగొట్టేస్తోంది. అయితే మహమ్మారి కరోనా కారణంగా అన్ని షూటింగ్స్ ఆగిపోయిన విధంగానే కామెడీ షో జబర్ధస్త్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. షూటింగ్స్ మొదలైన తరువాత మళ్లీ జబర్ధస్త్ షోలు కూడా మొదలయ్యే ఛాన్స్ లున్నాయని అంటున్నారు. అయితే కరోనా తరువాత సినిమాలు, సీరియల్స్ గతంలో మాదిరిగా ఉండవనే టాక్ వినిపిస్తోంది. అన్నింట్లోనే పొదుపు చర్యలు గట్టిగానే ఉండబోతున్నాయట.

ఈ నేపథ్యంలో జబర్ధస్త్‌లోనూ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయనే అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కొత్త యాంకర్లను నియమించుకునే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని తెలుస్తోంది. జబర్ధస్త్ స్టార్ జడ్జిగా ఉన్న రోజా రెమ్యూనరేషన్‌లోనూ కోత పడకతప్పదనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. అలాగే పొదుపు చర్యల్లో భాగంగా జబర్ధస్త్ షోలో ఉండే రెండో జడ్జి అంశంపై నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

నాగబాబు వెళ్లిపోయిన తరువాత జబర్ధస్త్‌లో ఎప్పటికప్పుడు కొత్త జడ్జిని తీసుకొస్తూ రోజా పక్కన కూర్చోబెడుతున్నారు. అయితే రాబోయే ఎపిసోడ్లలో మాత్రం రెండో జడ్జి అవసరం లేదనే నిర్ణయానికి వారు వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై జబర్ధస్త్‌లో సోలో జడ్జి ఉండే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇదే రకంగా షోను కొనసాగిస్తే… ఆడియెన్స్ కూడా సింగిల్ జడ్జి పద్ధతికి అలవాటు పడిపోతారనే భావనలో జబర్ధస్త్ నిర్వాహకులు నమ్ముతున్నారట. పైగా ఇది కూడా కొత్తగానే ఉంటుందని భావన.

error: Content is protected !!