పెళ్లి రోజు మంచు లక్ష్మి పారిపోవాలని అనుకుంది…. ఎందుకో తెలుసా?

లాక్ డౌన్ పిరియడ్ లో పాత జ్ఞాపకాలను సెలబ్రిటీలు షేర్ చేసుకుంటూ అభిమానులకు ఆనందం నింపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటె కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కూతురు కూడా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కల్గించాయి. కష్టపడి ఇండస్ట్రీకి వచ్చిన మోహన్ బాబు అన్ని రకాల క్యారెక్టర్స్ లో ఇమిడిపోయాడు. డైలాగ్ కింగ్ గా పేరొందాడు. అలాంటి మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి వచ్చిన మంచు లక్ష్మి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ట్రై చేస్తూ అందులో సక్సెస్ సాధిస్తోంది.

మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా చాలా పాత్రల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా తన కూతురుతో ఆడుకుంటున్న మంచు లక్ష్మి.. పాత విషయాలను కూడా గుర్తు చేసుకుని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. తాజాగా తన పెళ్లి ముచ్చట్లను కూడా ఫ్యాన్స్‌కు చెప్పింది. అంతేకాదు, అప్పటి ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. 2006లో ఆండీ శ్రీనివాస్‌తో మంచు లక్ష్మికి వివాహం జరిగింది.

పెళ్లి కూతురు వేడుకలో తన తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మల దేవితో దిగిన ఫోటోను అభిమానులతో మంచు లక్ష్మి పోస్ట్ చేసింది. ‘ ఆ రోజు తను చాలా కంగారు పడ్డా. పెళ్లి కూతురిగా సిద్ధమైన తర్వాత చాలా సిగ్గు పడ్డా’ అని పెళ్లి రోజు ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది . అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయే దారి కోసం సీరియస్‌గా వెతికానని గుర్తు చేసుకుంది. ఫాన్స్ ఈ ముచ్చట్లను చూసి ఫిదా అవుతున్నారు.

error: Content is protected !!