ఎన్టీఆర్ కి అత్తగా సీనియర్ నటీమణి నటిస్తుందట…ఎవరో తెలుసా?

వయస్సులో ఉండగా హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగి ఆతర్వాత పెళ్లితో కొంచెం గ్యాప్ ఇచ్చి, అత్తగా, అమ్మగా, అక్కగా ఇలాంటి పాత్రలతో ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. పైగా హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంత సంపాదించారో ఇప్పుడు కూడా అంతే సంపాదిస్తున్నారు … ఇలాంటి వాళ్ళల్లో అలనాటి అందాల ముద్దుగుమ్మ రమ్యకృష్ణ ఒకరు. బాహుబలి మూవీలో ఈమె క్యారెక్టర్ ఏ రేంజ్ లో అదిరిపోయిందో వేరే చెప్పక్కర్లేదు . ఇక రమ్యకృష్ణ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో తారక్ కి అత్త పాత్రలో అదరగొట్టబోతోందట.

గతంలో కూడా నా అల్లుడు మూవీలో అత్తపాత్రలో రమ్య దుమ్మురేపింది. ఇక తారక్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని ఇప్పటికే వార్తలొచ్చాయి. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలన్న లక్ష్యంతో చేస్తున్న ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ తరువాత పట్టాలెక్కనుంది.

‘అయిననూ హస్తినకు పోయిరావలె ‘టైటిల్ తో వచ్చే ఈ మూవీలో తారక్ కి అత్తగా రమ్య అయితే నూరుశాతం వర్కవుట్ అవుతుందని చిత్ర బృందం భావించిందట. ఇందుకోసం రమ్యకృష్ణను సంప్రదించారట. ఇదే నిజమైతే ఆడియన్స్ కి కనువిందు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ పూర్తిగా క్లారిటీ మాత్రం ఇంతదాకా రాలేదు.

error: Content is protected !!