షూటింగ్ లేకున్నా తారక్.. చరణ్ చేసే పని అదే

మిగతా దర్శకుల మాట ఏమోగానీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీరు వేరు. ఎందుకంటే తన సినిమాలోని ప్రతి ఎలిమెంట్ విషయంలో అతడు చాలా జాగ్రత్త పడతాడు. ప్రతిఫ్రేమ్ లో తన ముద్ర ఉంటుంది. ఇక హీరోల విషయంలో జక్కన్న ఎంతగా జాగ్రత్త పాటిస్తాడో ఊచించనవసరం లేదు. బాహుబలి తర్వాత భారీ ఎత్తున తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఇద్దరు హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి పాత్రల డిజైన్ చేయడంలో జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఈ ఇద్దరి కాస్ట్యూమ్స్ నుండి మొదలుకుని వారి బరువు వరకు అన్ని విషయాలను కూడా ప్రతి రోజు చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ షూట్ చేస్తూ ఉంటాడు. అయితే ఎంతోవేగంగా సాగుతున్న షూటింగ్ పై కరోనా నీడలా కారణంగా లాక్ డౌన్ వచ్చి పడింది. దీంతో గత రెండు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో హీరోలు ఇద్దరు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని భావించినా కూడా షూటింగ్ గత రెండు నెలలుగా జరగని కారణంగా వాయిదా పడనుంది. సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఇద్దరు కూడా బరువు పెరగకూడదని ముందే రాజమౌళి వారికి స్పష్టంగా చెప్పేశాడట. అందుకే షూటింగ్స్ లేకున్నా కూడా ఇద్దరు హీరోలు ప్రతి రోజు కనీసం రెండు నుండి మూడు గంటల వరకు వర్కౌట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బరువు తగ్గకుండా మరియు పెరగకుండా ఇద్దరు హీరోలు కూడా చాలా కష్టపడి మరీ డైట్ ను ఫాలో అవుతున్నారట. ప్రభుత్వం అనుమతులు వచ్చిన వెంటనే తక్కువ మంది టెక్నీషియన్స్ , నటీనటులతో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

error: Content is protected !!